PLD: నరసరావుపేట సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం బయట అర్జీలు రాసే పేరుతో కొందరు ప్రజలను మభ్యపెట్టి డబ్బులు అడుగుతున్నారని రూరల్ పోలీసులు హెచ్చరించారు. అర్జీలు కార్యాలయంలోనే రాయించుకోవచ్చని, అందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని రూరల్ ఎస్సై సీహెచ్. కిషోర్ తెలిపారు. డబ్బులు డిమాండ్ చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'అర్జీల పేరుతో డబ్బులు అడిగితే కఠిన చర్యలు'


