హైదరాబాద్: 28°C
తెలంగాణ

అదనపు చార్జీ వసూళ్లపై ప్రయాణికుడి ఆగ్రహం

HNK: హన్మకొండ నుంచి భూపాలపల్లికి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో చార్జీల వసూళ్లపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా రూ.110 ఉండే టికెట్‌కు సోమవారం రూ.150 వసూలు చేశారని భూపాలపల్లికి చెందిన ఓ ప్రయాణికుడు తెలిపారు. ఒక్కో టికెట్‌పై రూ.40 అదనంగా తీసుకోవడంపై ప్రశ్నించారు. చార్జీ పెంపునకు కారణమేంటో ఆర్టీసీ అధికారులు స్పష్టం చేయాలని కోరారు.