హైదరాబాద్: 28°C
తెలంగాణ

గడ్కోలులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

NZB: సిరికొండ గడ్కోలు గ్రామంలో సర్పంచ్ లతా శంకర్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంపత్ రెడ్డి, వార్డు సభ్యులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.