NRML: కడెం మండలం పెద్ద బెల్లాల్ గ్రామ హనుమాన్ ఆలయం వద్ద సోమవారం సీసీ రోడ్డు పోసే పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఈదుల తిరుపతి, గ్రామ పెద్దలు మరియు యూత్ మెంబర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ రోడ్డు నిర్మిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా సర్పంచ్ సూచించారు.
తెలంగాణ
కడెంలో హనుమాన్ ఆలయంలో సీసీ రోడ్డు పనులు


