హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

ADB: ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించి అర్జిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత సిబ్బందితో మాట్లాడి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.