హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండా సురేఖ బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తాం: ఎంపీ

WGL: మంత్రి కొండా సురేఖ బీజేపీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఇవాళ ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ..ఆమెపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, అందువల్ల ఆమె బీజేపీలో చేరడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదని తెలిపారు. ఆమె పార్టీ మార్పుపై వస్తున్న చర్చల నేపథ్యంలో ఎంపీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.