హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మార్కెట్‌లో మిర్చి, పత్తి ధరలు ఇలా

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఇవాళ మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,725,నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పత్తి ధర రూ.9,250గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు వెల్లడించారు. అయితే గత గురువారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.175,నాన్ ఏసీ మిర్చి ధర రూ.300 తగ్గిందన్నారు. పత్తి మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు.