హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేషనల్ టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలకు ఇనేశ్వర్ ఎంపిక

ASF: చింతలమానేపల్లి మండలం రణవెళ్లికి చెందిన చల్లుర్కర్ ఇనేశ్వర్ నేషనల్ అండర్-19 టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. కౌటాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఇనేశ్వర్ గోవాలో జరుగుతున్న జాతీయ పోటీల్లో తెలంగాణ తరఫున పాల్గొంటున్నాడు. కోచ్ గురువేందర్ ఆధ్వర్యంలో శిక్షణ పొందాడు. కుటుంబ సభ్యులు, అధ్యాపకులు అభినందించారు.