KKD: జనసేన పార్టీకి రూ.100 విరాళంగా ఇవ్వాలంటూ, ఇందుకోసం QR కోడ్ ద్వారా నగదు చెల్లింపులు చేయాలని కోరుతూ పిఠాపురం ప్రాంతంలో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్తలపై ఆ పార్టీ స్పందించింది. ఇది నకిలీ సందేశం అని, ఎటువంటి చెల్లింపులు చేయవద్దని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పార్టీ వర్గాలు సూచించాయి.
ఆంధ్రప్రదేశ్
'అదంతా ఫేక్ ప్రచారం'


