హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెంపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్రగాయాలు

ASF: సిర్పూర్ (టి) మండలం వెంపల్లి సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మద్యం సేవించి బైక్ నడుపుతుండగా అదుపుతప్పి కింద పడినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడగా వారిని రాళ్లపేటకు చెందిన వారిగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.