హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వామివారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి

GDWL: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అలంపూర్ పట్టణంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారిని ఇవాల దర్శించుకున్నారు. అనంతరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు, పూజారులు పూర్ణకుంభంతో, మేళతాళాలతో కేంద్ర మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.