హైదరాబాద్‌లో శుభకార్యాల్లో హిజ్రాల ఆగడాలు శ్రుతిమించుతున్నాయని ఒక నెటిజన్ వాపోయారు. పక్కింట్లో పెళ్లి జరుగుతుండగా పది మంది హిజ్రాలు వచ్చి రూ.50 వేలు కావాలని రగడ చేశారని తెలిపారు. రూ.20 వేలు ఇస్తామన్నా వినకుండా, మరో పది మందిని పిలిపించి బూతులతో నానా రచ్చా చేశారని పేర్కొన్నారు. చివరికి రూ.35 వేలు దండుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
పెళ్లి ఇంట్లో హిజ్రాల రచ్చ


