BHPL: గణపురం(మం)గాంధీనగర్ సమీపంలోని మిషన్ భగీరథ పంప్ హౌస్‌లో ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో ఐదు మండలాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో చిట్యాల GP అధికారులు వాటర్ ట్యాంకర్ ద్వారా మూడు కుటుంబాలకు కలిపి ఒకే డ్రమ్ము నీటిని అందించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటితో పాటు నిత్యావసరాలకు నీరు సరిపోక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
ఐదు మండలాలకు నిలిచిపోయిన నీటి సరఫరా


