సత్యసాయి: లేపాక్షి పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులకు గత మూడు నెలలుగా జీతాలు అందలేదు. దీంతో ఆదివారం లేపాక్షి బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సంతను సోమవారం ఉదయం చెత్తను కార్మికులు శుభ్రం చేయకుండా వదిలేశారు. ఫలితంగా సంత ప్రాంగణంలో చెత్త పేరుకుపోయింది. జీతాలు అందకపోవడంతోనే శుభ్రత పనులు చేయలేదని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
మూడు నెలలుగా జీతాల్లేవు.. సంతలో చెత్త


