HYD: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు X వేదికగా కీలక సూచనలు చేశారు. రాత్రివేళ వాహనం నడిపేటప్పుడు హెడ్‌లైట్‌ను సరైన విధంగా ఉపయోగించాలని కోరారు. అవసరం లేని సమయంలో హై బీమ్ పెట్టవద్దని, ఇది ఎదుటివారి చూపుకు ఇబ్బందిగా మారుతుందని తెలిపారు. ఎదుటి వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. సురక్షిత ప్రయాణం మన అందరి బాధ్యత అని గుర్తుచేశారు.
తెలంగాణ
హెడ్‌లైట్ వెలుగుపై సైబరాబాద్ పోలీసుల సూచన


