హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో చిరుత కలకలం!

KMR: నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి శివారులో చిరుత సంచారం కలకలం రేపుతుంది. సోమవారం తెల్లవారుజామున పొలాలకు వెళ్తున్న ఓ రైతుకు చిరుత కనబడినట్లు సర్పంచ్ భర్త సురేందర్ రెడ్డి తెలిపారు. చిరుతను చూసిన రైతు భయంతో గ్రామంలోకి వెళ్లి చెప్పడంతో గ్రామస్థులు వెళ్లి చూడగా చిరుత పొలాల పక్కనే ఉన్న గుట్టపైకి వెళ్లినట్లు గుర్తించామన్నారు.