హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆదిలాబాద్ లో వైభవంగా సంకట చతుర్థి పూజలు

ఆదిలాబాద్ పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో సంకట చతుర్థి పూజలు సోమవారం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా భక్తులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు.