హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి PUలో క్రీడా పోటీలు

WNP: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని PUలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో బోధన, బోధనేతర సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని రిజిస్ట్రార్ ప్రొ. పి. రమేశ్ బాబు తెలిపారు. నేటి నుంచి సెప్టెంబర్ 3 వరకు పోటీలు జరగనున్నాయి. క్రికెట్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్, షాట్‌పుట్, రన్నింగ్, స్కిప్పింగ్ పోటీలు నిర్వహిస్తామన్నారు.