హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్ష: కలెక్టర్

NLG: నీట్ పీజీ పరీక్ష నిన్న ప్రశాంతంగా జరిగింది. 180 మంది అభ్యర్థులకు గాను 179 మంది హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని SPR  పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని కలెక్టర్ బి. చంద్రశేఖర్ సందర్శించారు. సౌకర్యాలను పరిశీలించి, కేంద్రం బాధ్యులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నీట్ పీజీ పరీక్ష ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రశాంతంగా నిర్వహించినట్లు తెలిపారు.