BDK: పాల్వంచ మండలం మందేరేకలపాడు గ్రామానికి చెందిన కుంజా నర్సింహారావు(48) ఆదివారం మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్య మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ఆయన ఇంట్లో ఉరేసుకుని మృతి చెందారు. కుటుంబసభ్యుల సమాచారంతో పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. కుమారుడు ఇడమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై సురేశ్ తెలిపారు.
తెలంగాణ
భార్య మందలించిందని భర్త ఆత్మహత్య


