హైదరాబాద్: 28°C
తెలంగాణ

గెల్వలాంబమాత ఉత్సవాలకు వేళాయె

NGKL: వంగూరు మండల కేంద్రంలో గెల్వలాంబమాత బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 1-5 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ నకినమోని శేఖర్ తెలిపారు. ఐదు రోజుల పాటు వైభవంగా జరిగే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. నాలుగు రోజుల పాటు కల్వకుర్తి, అచ్చంపేట తదితర డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు తదితర సదుపాయాలు కల్పించామన్నారు.