BHPL: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో వరంగల్ జిల్లా వ్యాప్తంగా నేడు మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడతాయని, ప్రజలు జాగ్రత్తంగా ఉండాలని సూచించింది. అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని కోరింది.
తెలంగాణ
నేడు జిల్లాలో భారీ వర్షం


