హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ధర్మపథంలో గణపతి వ్రతం

అన్నమయ్య: వాల్మీకిపురం స్థానిక ధర్మపురంలోని శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయస్వామి ఆలయంలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు సంకష్టహర గణపతి వ్రతాన్ని నిర్వహించనున్నామని ఆలయ ప్రధాన అర్చకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యలు తెలిపారు. ఆలయంలో ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమై తదుపరి నిత్యసేవల అనంతరం సాయంత్రం సంకష్టహర గణపతి వ్రతం నిర్వహిస్తున్నామన్నారు.