WG: నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు నరసాపురం RDO దాసిరాజు తెలిపారు. నరసాపురం నియోజకవర్గంలో సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు విధుల్లో నిమగ్నమై ఉంటారని పేర్కొన్నారు. దీంతో డివిజన్లోని అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండే అవకాశం లేనందున కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు PGRS కార్యక్రమం రద్దు: RDO


