BDK: సింగరేణి కేజీఎం ఏరియాలో భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఆదివారం ప్రారంభించారు. దీంతో అనుమానాస్పద కదలికలు, అనధికార ప్రవేశాలను ఎప్పటికప్పుడు గుర్తించి భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసే అవకాశం ఏర్పడింది. ఎస్అండ్పీసీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రానికి కీలక ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను అనుసంధానించారు.
తెలంగాణ
భద్రత పటిష్ఠం.. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు


