హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు

కోనసీమ: మండపేట మండలం కేశవరంలో పలువురు వైసీపీ కార్యకర్తలు ఆదివారం సాయంత్రం టీడీపీలో చేరారు. మండల టీడీపీ అధ్యక్షుడు కర్రి తాతారావు, గ్రామ టీడీపీ నాయకుడు కంటిపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో వారు పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.