కోనసీమ: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు ఆత్రేయపురం ఎస్ఐ ఎస్. రాము, సిబ్బందితో కలిసి వద్దిపర్రు గ్రామంలో ఆదివారం రాత్రి ‘పల్లె నిద్ర' కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సైబర్ నేరాలు, పోక్సో చట్టం, రోడ్డు భద్రత, సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రజలు స్నేహ పూర్వకంగా మెలగాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలతో మమేకమైన పోలీసులు


