హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాద బాధితుడిని ఆస్పత్రికి తరలించిన CI

WGL: గీసుకొండ మండలం గొర్రెకుంట వద్ధ ఆదివారం సైకిల్‌పై వెళ్తున్న చంద్రాయపల్లికి చెందిన మారేడు ప్రభాకర్‌ను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తల, కాళ్లకు గాయాలయ్యాయి. పెట్రోలింగ్‌లో ఉన్న సీఐ విశ్వేశ్వర్ వెంటనే స్పందించి తన వాహనంలో ప్రభాకర్‌ను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.