BPT: చీరాల పట్టణంలోని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పార్క్ సెంటర్‌లో విద్యుత్ తీగలపై ప్రైవేట్ ఫ్లెక్సీ ఫ్రేమ్ ప్రమాదకరంగా వంగి పడిపోయింది. బలమైన గాలులు వీస్తుండటంతో అది ఏ క్షణంలోనైనా జారి కిందపడే ప్రమాదముందని వాహనదారులు, పాదచారులు ఆందోళన చెందుతున్నారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టి, ఆ ఫ్లెక్సీ ఫ్రేమ్‌ను వెంటనే తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ తీగలపై ప్రమాదకరంగా ఫ్లెక్సీ!


