హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంతరిక్ష రంగంలో చీరాల కుర్రోడి ప్రతిభ

BPT: భారత్ ప్రయోగించిన తొలి ప్రైవేటు రాకెట్ 'విక్రమ్‌-1' రూపకల్పనలో భాగస్వామి అయిన చీరాల యువకుడు గారపాటి రాకేష్‌ను తహసీల్దార్ కె.గోపీకృష్ణ, రెడ్‌క్రాస్ సభ్యులు ఘనంగా సన్మానించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా పట్టుదలతో అంతరిక్ష రంగంలో రాణించి చీరాల కీర్తిని చాటడం జిల్లాకే గర్వకారణమని కొనియాడారు.రాకేష్ విజయప్రస్థానం యువతకు గొప్ప స్ఫూర్తి అన్నారు.