హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు KMCలో ప్రజావాణి రద్దు

ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు KMC కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. SIR–2026లో భాగంగా నగరంలోని 60 డివిజన్లలో సంబంధిత అధికారులు నిమగ్నమైనందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశామని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రజలు, దరఖాస్తుదారులు గమనించి సహకరించాలని కోరారు.