హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూరగాయల మార్కెట్ ప్రెసిడెంట్ మృతి

PLD: వినుకొండ పట్టణం 14వ వార్డు శృంగారవనానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, కూరగాయల మార్కెట్ ప్రెసిడెంట్ సుంకర శ్రీనివాసరావు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆయన నివాసానికి చేరుకుని పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.