హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు యథావిధిగా పోలీస్ పీజీఆర్ఎస్

కృష్ణా జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీ-కోసం) కార్యక్రమాన్ని నేడు యథావిధిగా నిర్వహించనున్నట్లు ఎస్పీ వి. విద్యాసాగర్‌ నాయుడు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంతో పాటు అన్ని సబ్-డివిజన్లలోనూ ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు.