JGL: కొడిమ్యాల మండల జామా మసీద్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మహ్మద్ రోషన్, ఉపాధ్యక్షుడిగా షాకీర్, ప్రధాన కార్యదర్శిగా అజీజ్ ఖాన్ ఎన్నికయ్యారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సభ్యులకు రోషన్ కృతజ్ఞతలు తెలిపారు. మసీద్ అభివృద్ధి, నిర్వహణకు ప్రాధాన్యమిస్తూ అందరి సహకారంతో కార్యక్రమాలు చేపడతామన్నారు.
తెలంగాణ
జామ మసీదు నూతన కమిటీ కార్యవర్గం ఎన్నిక


