హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోరుట్లలో డెయిరీ మిల్క్ హౌస్ యూనియన్ సమావేశం

JGL: పాడి రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొరుట్ల డెయిరీ, మిల్క్ హౌస్ యూనియన్ ఆధ్వర్యంలో పాల ధర పెంచాలని ఆదివారం నిర్ణయించారు. పశువుల దాణా, మేత, వైద్యం, నిర్వహణ ఖర్చులు పెరగడంతో ప్రస్తుత ధరలతో రైతులకు ఆశించిన ఆదాయం రావడం లేదని యూనియన్ సభ్యులు తెలిపారు. రైతులపై పెరుగుతున్న భారాన్ని పరిగణనలోకి తీసుకుని ధర పెంచాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.