హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి

KDP: ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద నిన్న రాత్రి సమయంలో రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో అప్రార్‌ (19) అనే యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన ఆటో డ్రైవర్లు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించి క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.