MLG: ఏటూరునాగారంలో సెప్టెంబర్5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీపీటీఎఫ్ ములుగు జిల్లాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉపాధ్యాయ క్రీడాపోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సర్పంచ్ కాకులమర్రి శ్రీలత ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఉపాధ్యాయుల శారీరక, మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మహేష్, చిటమట రఘు తదితరులున్నారు.
తెలంగాణ
టీపీటీఎఫ్ ఉపాధ్యాయ క్రీడా పోటీలు ప్రారంభం


