హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామగుండంలో 3కే రన్

PDPL: జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా జ్యోతినగర్ ఎంజీ స్టేడియంలో ఆదివారం ఎన్టీపీసీ రామగుండం స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 3కే రన్ నిర్వహించారు. ఈడీ (ఆర్అండ్) చందన్ కుమార్ సమంత రన్‌ను ప్రారంభించారు. ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, చిన్నారులు కలిపి 226 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫిట్‌నెస్, ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.