హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయంలో పోటెత్తిన భక్తులు

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. శ్రావణమాసం, సెలవు రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది.