హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు

HNK: సర్కిల్ పరిధిలోని 98 అంగన్వాడీ కేంద్రాలకు NPDCL ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించినట్లు SE సామ్యా నాయక్ తెలిపారు. విద్యుత్ సౌకర్యంతో ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి మోటార్లు వినియోగించుకోవచ్చని చెప్పారు. చిన్నారులకు మెరుగైన వాతావరణం కల్పించడంతో పాటు విద్య, పోషకాహారం, ఆరోగ్య కార్యక్రమాలను సజావుగా నిర్వహించేందుకు ఈ సౌకర్యం ఉపయోగపడుతుందని వెల్లడించారు.