KDP: సిద్ధవటం మండలం భాకరాపేట–సిద్ధవటం ప్రధాన రహదారిలోని అయ్యప్పస్వామి గుడి సమీపంలో ఆదివారం మధ్యాహ్నం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బద్వేల్ సుందరయ్య కాలనీకి చెందిన వెంకట సుబ్బారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఎడమ పాదం పూర్తిగా దెబ్బతినడంతో స్థానికులు 108లో కడప రిమ్స్‌కు తరలించారు. ఎస్సై హారిక ఆధ్వర్యంలో పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు


