హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పామాయిల్ రైతుల సమస్యలపై ఎర్రబెల్లి ఆరా

MHBD: తొర్రూరు వ్యవసాయ మార్కెట్‌లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పామాయిల్ గెలలను పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగడం లేదని విమర్శించారు. దీంతో జిల్లా పామాయిల్ రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ, ఫ్యాక్టరీ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు.