E.G: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 33⅓ శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. కడియం మండలం మాదవరాయుడుపాలెంలో ఆదివారం ఆయన మాట్లాడారు. స్థానిక ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నాలు ఫలించవన్నారు. అర్హులందరికీ త్వరలో కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
బీసీ రిజర్వేషన్లకు కూటమి కట్టుబడి ఉంది: మంత్రి


