హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి వర్మ ఆర్థిక సాయం

KKD: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ దొంతమూరు గ్రామంలో గ్యాస్ లీకేజీతో జరిగిన అగ్నిప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. వర్మాస్ కావ్య ఫౌండేషన్ ద్వారా బాధిత కుటుంబానికి ఆదివారం రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం నుంచి అర్హత మేరకు అన్ని సహాయాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.