AKP: వినాయక చవితి మహోత్సవాలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం శుభదినం కావడంతో కోటవురట్ల సీతారామరాజు నగర్‌లో శ్రీ బాల వినాయక యూత్ ఆధ్వర్యంలో వినాయకుని పందిరి రాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు, పెద్దలు పసుపు కుంకుమలతో పూజలు చేసి, దీపారాధన అనంతరం గణనాథుడిని స్మరిస్తూ రాట వేశారు. అనంతరం భక్తులకు బెల్లం, పప్పు, తాంబూలాలను ప్రసాదంగా అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక చవితికి ఘనంగా రాటోత్సవం


