హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం

WGL: ఖానాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం(రేపు) మండల స్థాయి ప్రజావాణి నిర్వహించనున్నట్లు MPDO వి.అద్వైత తెలిపారు. కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు హాజరవుతారని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను జిల్లా స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని MPDO కోరారు.