E.G: కడియం మండలం మాధవాయపాలెం గ్రామంలో శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి నూతన విగ్రహాన్ని ఆదివారం మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కోనసీమ ప్రాంతానికి చెందిన వెంకటరెడ్డి గొప్ప సామాజిక సంస్కర్త అని, శెట్టిబలిజ సమాజ సంక్షేమ వ్యవస్థకు పునాది వేసిన వ్యక్తి అని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహావిష్కరణ


