హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రాజానగరం హైవేపై కాంక్రీట్‌ లారీ బోల్తా

E.G: రాజానగరం జాతీయ రహదారిపై ఆదివారం సిమెంట్‌ కాంక్రీట్‌ లారీ బీభత్సం సృష్టించింది. స్థానికుల వివరాలు.. రాజమండ్రి నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న లారీ నన్నయ యూనివర్సిటీ సమీపంలో అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి పల్టీలు కొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.