హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బస్సులో మరచిన బ్యాగ్.. బంగారం సేఫ్

KKD: విజయవాడ-కాకినాడ సర్వీసులో ప్రయాణించిన ఓ మహిళా ప్రయాణికురాలు వైఎస్సార్ సర్కిల్ వద్ద దిగే సమయంలో తన బ్యాగ్‌ను బస్సులోనే మర్చిపోయారు. ఇంటికి వెళ్లిన తర్వాత విషయం గుర్తించి కాకినాడ డిపోను సంప్రదించారు. సిబ్బంది వెంటనే స్పందించి బస్సును తనిఖీ చేయగా బ్యాగ్ లభించింది. అందులో సుమారు రెండు తులాల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు.