హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పెద్దపులి దాడి.. రెండు దూడలు మృతి

ELR: పోలవరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం మరోసారి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రాజెక్టు హెడ్‌ రెగ్యులేటర్ సమీపంలోని దేవరగుంది ముంపు గ్రామం వద్ద రెండు గేదె దూడలపై పెద్దపులి దాడి చేసి చంపినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది పులి అడుగుజాడలను పరిశీలించి సమీప ప్రాంత ప్రజలనీ అప్రమత్తం చేశారు.